telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు సినీ పరిశ్రమ ఒకరి సొత్తు కాదు..ఇది అందరి సొత్తు –

నేచురల్ స్టార్ నాని హీరోగా, నజ్రియా హీరోయిన్‌గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే..సుందరానికీ’.‘మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జూన్ 10న విడుద్లకానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శిల్పకళావేదికలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఇక్కడకు వచ్చిన పెద్దలకు, ఆడపడుచులకు, అక్కచెల్లెలకు ముందుగా నా నమస్కారం. అభిమానులుగా మీ ఉరకలెత్తే ఉత్సాహం లేకపోతే ఈ ఈవెంట్స్ కు అందం ఉండదు.. ఈ సభలకు విశిష్ట అతిధులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అంటే సుందరానికీ సినిమా ఈవెంట్ కు నన్ను ఆహ్వానించినందుకు నిర్మాతలకు నా ధన్యవాదాలు.

హీరో నాని నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.. బలంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. హీరోయిన్‌గా నటించిన నజ్రియాకు తెలుగు చిత్ర పరిశ్రమకు స్వాగతం. నరేష్ అంటే నాకు చాలా గౌరవం.’‘ఈ సినిమాలో నటించిన అందరికీ అభినందనలు తెలిపారు.

వివేక్ సాగర్ అందించిన సంగీతం చాలా బాగుంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ అద్భుతంగా తెరకెక్కించారు. ఒక సినిమా అద్భుతంగా మనల్ని అలరించాలి, బావుండాలి అంటే వెన్నుముక దర్శకుడు, రచయిత, ఆ రెండింటిని ఒకటే రూపంలో వచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ ఒకరి సొత్తు కాదు. ఇది అందరి సొత్తు. మీ అందరి అభిమానం.. ప్రజల కోసం పనిచేయగలిగే, నిలబడగలిగే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండె దైర్యం మీ అందరి అభిమానం..

 

ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండె దైర్యం మీరు ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది.  ‘ఎన్ని ఆలోచనలు ఉన్నా సినిమా వేరు. రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది. చిత్ర పరిశ్రమ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నానికి మా ఇంట్లో చాలా మంది అభిమానులున్నారు.

నేను త్వరలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్‌లో నటించబోతున్నాను. అంటే సుందరానికి ఈవెంట్‌కు వచ్చేటప్పుడు ఇది నాని గారి సినిమా నా ఏవీ వేయవద్దని చెప్పాను. కానీ నా మాట ప‌ట్టించుకోలేదు ఏవీ వేశారు. వేయకపోతే అభిమానులు ఏం అనుకొంటాన‌ని వేశారు.

నా ఏవీ చూసుకుంటే నాకు భయం వేసింది.. చెమ‌ట ప‌ట్టేసింది. న‌న్ను నేను చూసుకోలేక‌పోయాను. న‌న్ను రాజ‌కీయాల్లోకి వెళ్లి గొడవ పెట్టుకోవడానికి భయం లేదు కానీ సినిమా చేయడానికి భయవేస్తుంది.’ .నేను డ్యాన్స్ వేసింది ఇష్టంతో కాదు..మీరంటే (అభిమానులు) భ‌యంతో వేసింది. నాకు చాలా చ‌క్క‌గా వెన‌కాల మ్యూజిక్ వ‌స్తే న‌డ‌వ‌డం ఇష్టం ..నాకు న‌డిచే అవ‌కాశం ఇవ్వండి ..డ్యాన్స్ చేసే అవ‌కాశం ఇవ్వొద్దు..మీరంతా క్షేమంగా ఇంటికి వెళ్లాలంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు చెప్పారు.

Related posts