telugu navyamedia
సినిమా వార్తలు

‘శ్రీదేవి సోడా సెంటర్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో పాటుగా విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు” 27న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి మణి శర్మ సంగీతం అందించారు. పావెల్ నవగీతన్, నరేష్, మోనోజిత్ శిల్, అరిపిరాల సత్యప్రసాద్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త పలువురు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న “శ్రీదేవి సోడా సెంటర్‌”కు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు.

Related posts