telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కోన‌సీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే -పవన్ కళ్యాణ్

*రైతుల ప‌క్షాన జ‌న‌సేన పోరాడుతుంది..
*కోన‌సీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే..
*రైతుల ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హారిస్తుంది..
*కోనసీమ రైతులకు జనసేన అండగా ఉంటుంది..

కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసీపీ దే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం గా వ్య‌వ‌హ‌రిస్తుంది.

ధాన్యం అమ్మిన డబ్బులు సకారంలో చెల్లించరు, డ్రెయిన్లు, కాలువల నిర్వహణ పట్టించుకోరు.. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరు.. ఇలాంటి ఇబ్బందులన్నీ పెట్టడం వల్లనే రైతులు క్రాప్ హాలీడే వంటి కీలక నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

11 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి పునరావృతం కావడం దురదృష్టకమని.. 2011లో కోనసీమ రైతులు ప్రకటించిన క్రాప్ హాలీడే దేశం దృష్టిని ఆకర్షించిందన్నారు. అప్పట్లో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించడంతో 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు వచ్చి రైతాంగం సమస్యలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Image

ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని… దాదాపు రూ.475 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.రైతుల క్రాప్ హాలీడే ప్రకటించగానే భ‌య‌ప‌డి రాత్రికి రాత్రే..వారి ఖాతాల్లో రూ.139కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారని పవన్ కల్యాణ్ విమర్శించారు. క్రాప్ హాలీడే ప్రకటించిన మండలాల్లో సాగు నీరు అందుబాటులో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు.

క్రాప్ హాలీడే ప్రకటించిన రైతులపై వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు చేయడంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రైతులపై వైసీపీ నేతలవి చౌకబారు విమర్శలన్నారు. ఏ సమస్య వచ్చినా రాజకీయ కోణంలో చూడడం తప్ప వైసీపీ నేతలకు సమస్యను పరిష్కరించే మనస్తత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ రైతులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు

Related posts