telugu navyamedia
సినిమా వార్తలు

చిరును మీట్ అయిన ప్రకాష్ రాజ్..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈరోజు మార్నింగ్ జిమ్‌లో బాస్‌ని కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అని రాసుకొచ్చారు.

కాగా, ఆయన చేతి గాయాన్ని చిరు అడిగి తెలుసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఇటీవలే ఇటీవల స్టార్ హీరో ధనుష్ సినిమా షూటింగ్‏లో ప్రమాదానికి గురికావడంతో చిన్న సర్జరీ అయిన విషయం తెలిసిందే.

ఇక‌ ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని అనౌన్స్ చేశారో అప్పటినుండి వార్తల్లో నిలుస్తున్నారు. లోకల్ – నాన్ లోకల్ నుండి రకరకాలు ఆయణ్ణి టార్గెట్ చేస్తూ ఎవరెన్ని విమర్శలు చేసినా మౌనంగానే ఉండిపోయారు.

మధ్యలో ‘తెగేదాకా లాగొద్దు’.. అని ఓసారి.. ‘జెండా ఎగరేస్తాం’ అని మరోసారి ట్వీట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎవరేమనుకున్నా ప్రకాష్ రాజ్‌కు మెగాస్టార్ సపోర్ట్ ఉంటుందని మెగా బ్రదర్ నాగబాబు చెప్పారు. ప్రకాష్ రాజ్ పై వస్తున్న విమర్శలకు సైతం నాగబాబు కౌంటర్లు ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా అదే ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం చిరు-ప్రకాష్ భేటీతో ‘మా’రింత ఆసక్తికరంగా మారింది.

Related posts