telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

వైసీపీలో చేరనున్న సినీ నటుడు అలీ!

Ali comments Pawan Kalyan YCP

సినీ హాస్యనటుడు అలీ వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. శనివారం ఆ పార్టీ అధినేత ఆయన జగన్‌ను కలవనున్నారు. మొదట పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని పశ్చిమగోదావరిలో కలిసి అక్కడి నుంచి జగన్‌ వద్దకు వెళతారని సమాచారం. ఇటీవల జగన్‌తో అలీ భేటీ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వైకాపాలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో ఆయన జగన్‌ను శనివారం కలవనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జనవరి 9న జగన్ పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ సభలో అలీ వైసీపీలో చేరుతారని సమాచారం. పార్టీ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అలీ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Related posts