telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ముందుచూపు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి…

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేకపోవడంవల్లనే కరోనాను అరికట్టడంలో విఫలమయ్యారు. పీఎం కేర్ పేరుతో వేల కోట్లు వసూలు చేస్తున్నారు అని తెలిపారు. ముందుచూపు లేకపోవడం వల్లనే వ్యాక్సిన్ అందరికి వేయలేక పోయారు. సొంతంగా భారత దేశంలో వ్యాక్సిన్ తయారు అవుతున్నా. ఇక్కడి ప్రజలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వలేకపోతున్నారు. కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ కు రాజకీయ స్వార్థంతో కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడటం లేదు. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ పై చర్యలుతీసుకుంటామన్నారు… గాలికి వదిలేశారు అని తెలిపారు.

Related posts