telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు..

విశాఖ ప‌ట్నంలో తన కాన్వాయ్‌ నిలిపివేయడంపై టీడీపీ అధినేత‌ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నలభై ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. తాను హత్యలు, గూండాయిజం చేసేవాడిని కాదని, రిషికొండకు వెళ్తుంటే పోలీసుల పర్మిషన్ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో తాము ఎప్పుడూ ఇలా చేయలేదని చంద్రబాబు అన్నారు. తమ పాలనలో పోలీసులు ఇలా వ్యవహరించలేదని గుర్తు చేశారు. తాము రిషికొండ వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండ, వైజాగ్‌లో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతామని హెచ్చరించారు.

కాగా..టూరిజం పేరుతో రుషికొండను మొత్తం తొలిచేసి ఆ వ్యర్థాలను కూడా సముద్రతీరంలో పారబోస్తున్నారని.. పర్యావరణ నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నారని కొంత కాలంగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రూ. కోట్ల విలువైన టూరిజం కాటేజీల్ని కూల్చేసి కొత్తగా ఏం కట్టాలనుకుంటున్నారో కూడా స్పష్టత లేదు.

ప్రస్తుతం నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రుషికొండ చుట్టూ తవ్వేశారు. మధ్యలో భాగం మాత్రమే ఉంది. దాన్ని ఉంచుతారో తొలగిస్తారో స్పష్టత లేదు. రుషికొండ తవ్వకాల వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది

Related posts