telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇండియన్‌ సినిమాకు మీరు వీరప్పన్‌.. ప్రశాంత్‌ నీల్‌.

‘కేజీఎఫ్ 2’ సినిమా కేవలం శాండిల్‌వుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా దర్శకుడిగా మారాడు. దీంతో ప్రశాంత్‌ నీల్‌పై వర్మ వరుస ట్వీట్స్‌ చేస్తు ప్రశంసలు కురిపించాడు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. తాజాగా మరోసారి ప్రశాంత్ నీల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు వర్మ.

‘ప్రశాంత్‌ నీల్‌.. మీకు అన్‌ హ్యాపీ డైరెక్టర్స్‌ డే. కేజీయఫ్‌ మూవీతో మీరు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌ దర్శకులకు కనువిప్పు కలిగించారు. ఇండియన్‌ సినిమాకు మీరు వీరప్పన్‌ లాంటి వారు’ అంటూ వర్మ కొనియాడాడు. సంప్రదాయ పరమైన సినీ పరిశ్రమలకు చెందిన 95 శాతం ప్రజలకు మీ కేజీయఫ్‌ సినిమా నచ్చి ఉండదు.

ఈ మూవీతో మీరు సినీ పరిశ్రమలోని పాత పద్దతిని దూరం చేసి కొత్త పద్దతిని పరిచయం చేశారు’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాగాక ఎంతో మంది రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారు కానీ, వాళ్లు వేస్ట్ చేస్తున్నంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారంటూ ప్రశాంత్‌ నీల్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు వర్మ.

Related posts