మన రాష్ట్రం గురించి త్యాగం చేసిన మహనీయులను తలచుకోవడం, వారి దారిలో ప్రయాణించడం ఇలా అన్నీ ఆ రోజున ప్రమాణాలు చేస్తాం. తెలంగాణా ఏపీ విడిపోతే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటుంది. ఏపీకి ఏది అవతరణ్ దినోత్సవం అని నాటి టీడీపీ సర్కార్ కేంద్రాన్ని కూడా అడిగింది. దానికి బదులుగా కేంద్రం నవంబర్ 1న చేసుకోమని కూడా సూచించింది.
ఈ నేల 16న జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు అంటున్నారు. దీంతో ఎప్పటి మాదిరిగానే ఇకపై ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1న నిర్వహిస్తారన్న మాట. ఇది ఓ విధంగా ఆంధ్రుల గుండెలు ఉప్పొంగే సమయం. ఆంధ్ర జాతి పండుగ దినం.