telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోటెత్తిన వరద నీరు..

తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుపాను ప్రభావంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఏక‌దాటిగా మూడు రోజులుగా ప‌డుతున్న కుండపోత వర్షాలు కార‌ణంగా పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.

Cyclone Gulab, Visakhapatnam airport: పోటెత్తిన వరద నీరు - Telugu Oneindia

ఈ క్ర‌మంలో విశాఖ విమానాశ్రయాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్ర‌యాణికులు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు లోప‌లికి వెళ్ళేందుకు ఇబ్బందులు ప‌డ్డారు. ఎగువ ఉన్న మెగాద్రి గెడ్డ నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీరు ఎయిర్‌పోర్టులోకి వ‌చ్చి చేరింది. గంట గంట‌కు వ‌ర‌ద పెర‌గ‌డంతో ఏ స‌మ‌యంలోనైనా ర‌న్ వే మీద‌కు వ‌ర‌ద నీరు వ‌స్తుందేమోన‌ని అధికారులు ఆందోళ‌న చెందారు. ప్ర‌యాణికులు ఇబ్బందుల‌కు గురి కాకుండా ప్ర‌స్తుతం నీరు బ‌య‌ట‌కు పంపే చ‌ర్య‌లు చేప‌ట్టారు.

అలాగే విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్‌లో మోకాలి లోతు వర్షపు నీరు నిలిచింది. ఫలితంగా- వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. లంకెలపాలెం, గాజువాకల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది

 

Related posts