telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు!

4 died in chattishhgarh on rain

గత వారం రోజుల నుంచి కుండపోత వానలతో అతలాకుతలమైన తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన వెలువడింది. రాష్ట్రాన్ని మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని నివేదికలో వెల్లడించారు.

ఉత్తర ఒడిశా, జార్ఖండ్ పై తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఆగస్టు 23న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలోనూ వానలు పడనున్నాయి. రేపు ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related posts