telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ రాజధానిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ..

*బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
*ఏపీలో జ‌నాల‌పై భారీగా ప‌న్నులు క‌డుతున్నార‌ని..
నిరూపిస్తామ‌ని చంద్ర‌బాబు స‌వాల్‌..
*జ‌గ‌న్ బాదుడుకు రిషికొండ స‌గం తెగిపోయింది.
*జ‌గ‌న్‌లాంటి వ్య‌క్తులు రాజ‌కీయాల్లో ఉండ‌కూడ‌దు..
*ఖ‌బ‌డ్దార్‌..జ‌గ్ర‌త్తగా ఉండండి వీసీ..

ఏపీ రాజ‌ధానిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘బాదుడే బాదుడే కార్యక్రమం’ పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన విశాఖలోని తాళ్ల‌వ‌ల‌స‌లో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ… విశాఖకు అభివృద్ధి కావాలా.. రాజధాని కావాలా అని ఆయన ప్రశ్నించారు. అమరావతిని రాజధానిని చేసి విశాఖను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

దేశంలో అన్ని రాష్ర్టాల కంటే ..ఏపీలో ప‌న్నులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని…ఇది నిరూపిస్తాన‌ని.. లేదంటే రాజ‌కీయాల్లోనుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాన‌ని చంద్ర‌బాబు స‌వాల్ చేశారు.

జ‌గ‌న్ బాదుడుకు రిషికొండ స‌గం తెగిపోయింద‌ని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్నయో.. ఎక్కడ ఖ‌నిజాలుయో తెలుసుకోవడానికే పాదయాత్ర చేశారని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు.

తాను యువతకు ఐటీ ఉద్యోగం ఇస్తే.. జగన్‌ ఐదు వేలు జీతంలో వాలంటీర్‌ ఉద్యోగం ఇచ్చాడంటూ నిప్పులు చెరిగారు. జగన్‌ పాలనలో ఎన్నో అరిష్టాలు ఉన్నాయని.. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మండిపడ్డారు. జగన్‌ అడిగిన ఒక్క ఛాన్స్‌… ఇక వైసీపీకి చివరి ఛాన్స్‌ అన్నారు. జ‌గ‌న్‌లాంటి వ్య‌క్తులు రాజ‌కీయాల్లో ఉండ‌కూడ‌దు చంద్ర‌బాబు అన్నారు.

రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్లగలను. నన్ను అడ్డుకుంటే ఖబడ్దార్. అత్యాచారాలపై హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని.. తల్లులది తప్పైతే జగన్‌ను పెంచిన తల్లిని ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. పదో తరగతి పేపర్ లీక్ అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని టీడీపీ చీఫ్ నిలదీశారు. పేపర్ లీక్ వెనుక వైసీపీ హస్తం వుందని ఆయన ఆరోపించారు. పేపర్లు లీక్ అవుతుంటే మంత్రి బొత్స ఏం చేస్తున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు.

నాడు-నేడు అంటూ పాఠశాలలకు వైసీపీ రంగులు వేశారు. కోర్టు ఆదేశంతో గ్రామ సచివాలయాలకు వేసిన రంగులను మళ్లీ మార్చారు. నా పోరాటం నా కోసం కాదు..మీకోసం. పెళ్లి అయితే కళ్యాణ కానుక.. పండుగ అయితే పండుగ కానుక ఇచ్చామ‌ని అన్నారు.

Related posts