ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ఫ్యాన్ గాలికి టీడీపీ సైకిల్ చతికిలపడింది. హిందూపురంలో బాలయ్య, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రచారం చేసినా.. పార్టీ సరైన స్థానాలు గెలవలేకపోయింది. అయితే.. తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించగా… మైదుకూరులో కూడా టీడీపీ లీడింగ్ లో ఉంది. ఈ రెండు చోట్ల తప్పించి ఎక్కడా కూడా టీడీపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కాగా.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దుమ్ములేపుతోంది. ఇప్పటికే 55 పైగా మున్సిపాలిటీలను కైవలసం చేసుకుంది వైసీపీ. తాజాగా గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం వైసీపీ కైవసం చేసుకుంది. మొదటి నుంచి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించిన వైసీపీ… కార్పొరేషన్ లో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. 58 స్థానాల్లో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. అటు 30 స్థానాలు గెలుచుకుంది టీడీపీ. ఇక జనసేన 3 స్థానాలు గెలువగా.. బీజేపీ 1, సీపీఐ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 4 గెలుపొందారు. అటు విజయవాడ లోనూ వైసీపీ దూసుకుపోతోంది. త్వరలో ఉప ఎన్నికలు జరగబోయే తిరుపతిలోనూ వైసీపీ విజయం సాధించింది.
previous post