మంగళవారం సాయంత్రానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను మచిలీపట్నానికి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇప్పటివరకు వాయవ్య దిశగా పయనించిన ఫణి, దిశ మార్చుకుని ఈశాన్యదిశగా పయనిస్తున్నట్టు ఏపీ ఆర్టీజీఎస్ అధికారులు చెబుతున్నారు. ఏపీలో దీని ప్రభావం ఎక్కువగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో.. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 2,3 తేదీల్లో శ్రీకాకుళం గార, ఇచ్చాపురం, కంచిలి, మందస, సోంపేట, కవిటి, వజ్రపుకొత్తూరు, నందిగం, పొలాకి, పలాస, సంతబొమ్మాళి మండలాలతో పాటు విజయనగరం జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల, గుర్ల, చీపురుపల్లి, డెంకాడ మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మెగా ఫ్యామిలీ నిజమైన వారసుడు అల్లు అర్జున్… హీరోలపై మాధవి సంచలన కామెంట్స్