telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్ … ఈరోజు ఎన్నంటే…?

corona vairus

ఏపీ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే…ఇవాళ మాత్రం కేసులు కాస్త తగ్గాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.58 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. అందులో ఏపీలో కొత్తగా 1,593 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 858711కి చేరింది. ఇందులో 835801 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 16,000కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6910కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 60, చిత్తూరులో 198, తూర్పుగోదావరి జిల్లాలో 183, గుంటూరులో 206, కడపలో 58, కృష్ణాలో 196, కర్నూలులో 14, నెల్లూరులో 40, ప్రకాశంలో 43, శ్రీకాకుళంలో 28, విశాఖపట్నంలో 45, విజయనగరంలో 18, పశ్చిమ గోదావరిలో 227కేసులు నమోదయ్యాయి.

Related posts