telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఫ్లిప్ కార్ట్ లో మరింత తగ్గిన .. రెడ్ మీ నోట్ 7 ప్రో ధరలు…

redmi note 7 pro flash sale by mi and flipkart

పండుగని దృష్టిలో పెట్టుకున్న ఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్స్ మీద ఆఫర్స్ ని ప్రకటిస్తున్నాయి. ప్రతీ ఒక్క కష్టమర్ తన ఆన్లైన్ స్టోర్ లోకి వచ్చి ఎదో ఒక వస్తువుకోనేలా పండగ ఆఫర్ల పబ్లిసిటీ తో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఫ్లిప్కర్ట్ దీపావళి సందర్భంగా redmi నోట్ 7 ప్రో మొబైల్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. దీపావళి సేల్ లో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ. 11,9999 ధరకి విక్రయిస్తున్నట్టుగా ప్రకటించింది. Redmi నోట్ 7 ప్రో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వేరియంట్ ధరని కేవలం రూ. 11,999 ధరకు విక్రయించడనుండటంతో ఎప్పుడెప్పుడు ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుందో అంటూ వేచి చూస్తున్నారు.

ఈ మొబైల్ ఫ్లిప్కర్ట్ నుంచీ కొనుగోలు చేసేవారికి, అలాగే పాత ఫోన్ మార్చి తీసుకునే వారికి దాదాపు రూ. 11,200 వరకూ భారీ తగ్గింపు దక్కనుంది. ఇదిలా ఉంటే redmi నోట్ 7 ప్రో ని ఫిబ్రవరి 2019 లో భారత మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అప్పట్లోనే అత్యధిక మొబైల్స్ అమ్ముడుపోయిన మొబైల్ ఫోన్ గా ఈ redmi నోట్ 7 ప్రో రికార్డ్ క్రియేట్ చేసింది. తాజగా ఇదే ఫోన్ పై 2000 భారీ తగ్గింపు ప్రకటన చేయడంతో ఈ ఫోన్ కొనుగోలుపై భారీ అంచనాలు ఉన్నాయి అంటున్నారు.

Related posts