telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నిన్న వీళ్లే ఉత్తములన్నారు … నేడు వాళ్ళే అనివినిపారులంటున్నారు .. ఇదేమి రాజకీయమో..

best employees caught by ACB

ఇటీవల ఏసీబీ అధికారులకు ఉత్తమ మహిళా ఎమ్మార్వో అడ్డంగా దొరికిపోయిన ఘటన మరిచిపోకముందే అలాంటిదే మరో సంఘటన బయటపడింది. ఈసారి కూడా ఉత్తమ కానిస్టేబుల్‌గా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఓ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ పట్టుబడటం విశేషం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న తిరుపతి రెడ్డి అనే కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వెంకటాపూర్‌కు చెందిన రమేశ్ అనే ఇసుక వ్యాపారి నుంచి 17వేల రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. అతడి నుంచి గత రెండేళ్లుగా ఇలాగే లంచం తీసుకుంటున్నట్లు రుజువైంది.

తిరుపతిరెడ్డి తాజాగా రమేశ్‌ను లంచం కోసం వేధించారని, ఇసుక రవాణాకు సంబంధించి ఆయన దగ్గర అన్నీ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ 17వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో రమేశ్ విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో తిరుపతి రెడ్డి రమేశ్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదలావుంటే గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలకు గాను కానిస్టేబుల్ తిరుపతి రెడ్డి ప్రభుత్వ పురస్కారం అందుకోవడం గమనార్హం. మరునాడే ఇలా ఏసీబీ అధికారులకు పట్టుబడటం చర్చానీయాంశమైంది.

Related posts