జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో నాచారంలో బీజేపీ నాయకురాలు విజయలతారెడ్డి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపుతోంది… భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఆశించిన విజయలతారెడ్డి… ఆత్మహత్యాయత్నం చేశారు. తనకు దక్కాల్సిన టికెట్ ఇతరులకు కేటాయించారని మనస్తాపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారామె. వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు కుటుంబసభ్యులు.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తమకు టికెట్ రాకుండా మోసం చేసారని ఆరోపించారు విజయలతారెడ్డి. కాగా, గత గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీ నుండి పోటీ చేశారు విజయలతారెడ్డి.. ఈ సారి టికెట్ దక్కకపోవడంతో.. ఆత్మహత్యాయత్నం చేశారు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విడుదల చేయగా… భారతీయ జనతా పార్టీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది… 21 మందితో మొదటి లిస్ట్ విడుదల చేసింది బీజేపీ. ఈ జాబితాలు ముఖ్యంగా ఓల్డ్ సిటీకి సంబంధించిన అభ్యర్థుల పేర్లనే ప్రకటించారు.
previous post
లేనిపోనివి కల్పించి నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి