telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్”లో ఎన్టీఆర్ లుక్ వైరల్…!?

RRR

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో మూడో షెడ్యూల్ శర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. వ‌చ్చే ఏడాది జూలై 30న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. ఇద్ద‌రు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల కథ కావ‌డంతో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని టాక్‌. అయితే తాజాగా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇదేనంటూ ఫ్యాన్స్ తయారు చేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి నిజంగా “ఆర్ఆర్ఆర్”లో ఎన్టీఆర్ ఇలాగే ఉంటాడేమోనని ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా గ్రూప్ కూడా నమ్మేసింది. ఈ సంస్థే తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ పోస్టర్ ను షేర్ చేసింది. ఓ అభిమాని రూపొందించిన ఈ పోస్టర్ చూసి ఒక్క క్షణం నిజమైన పోస్టరేమో అనుకున్నామని, ఓ అభిమాని చేతిలో ఇంత కచ్చితమైన రీతిలో పోస్టర్ రావడం అద్భుతం అని శ్రేయాస్ గ్రూప్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Related posts