శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800లో నటించేందుకు విజయ్ సేతుపతి ఒప్పుకోగా.. అందులో నుంచి సేతుపతి తప్పుకోవాలంటూ కొంతమంది నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కొన్నిరోజుల క్రితం విజయ్ సేతుపతితో శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు జాతీయ అవార్డు గ్రహీత డైరెక్టర్ శీను రామస్వామి తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. విజయ్ సేతుపతిని ప్రాజెక్ట్ నుండి తప్పుకోమని సూచించిన వారిలో రామస్వామి కూడా ఉన్నారు. అలా కోరినందుకు ఇప్పుడు దర్శకుడు శీను రామస్వామికి బెదిరింపులు వస్తున్నాయట. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “నా జీవితం ప్రమాదంలో ఉంది. ముఖ్యమంత్రిగారు… మీరు సహాయం చేయాలి” అని కోరారు. అంతే కాకుండా ప్రెస్‌మీట్ పెట్టి మరీ తనకు, విజయ్‌సేతుపతికి మధ్య దూరం పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు.
என் உயிருக்கு ஆபத்து இருப்பதாக உணர்கிறேன்.முதல்வர் அய்யா உதவ வேண்டும்
அவசரம்.— R.Seenu Ramasamy (@seenuramasamy) October 28, 2020