telugu navyamedia
ట్రెండింగ్

శునకాల కోసం .. ఇండోర్ పార్క్..

dog indore park in texas

శునకాలను బయటకు తీసుకెళ్లాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. వాటిని బయటకు తీసుకువస్తే మన మాట అస్సలు వినవు. అటు ఇటూ పరుగులు పెడతాయి. దీనితో వాహనాలు వాటికి తగులుతాయోనన్న భయం చాలా మంది శునక ప్రియులకు ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో శునకాలు, శునకప్రియులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎండలకు తాళలేక మనమే కాదు శునకాలు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని టెక్సాస్‌లో శునకాల కోసం ప్రత్యేకంగా ఓ పార్కు ఏర్పాటవుతోంది.

వేసవి కాలంలో టెక్సాస్‌లోని ఆస్టిన్‌ నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనితో సామాన్య ప్రజలతోపాటు వారు పెంచుకునే శునకాలు ఇంటి బయటకు రావడానికి జంకుతుంటాయి. అందుకే కెనైన్‌ కామన్స్‌ సంస్థ ఆస్టిన్‌లో పెద్ద శునకాల పార్కును అందుబాటులోకి తీసుకొస్తోంది. దాదాపు 16 మిలియన్‌ డాలర్లు వెచ్చించి 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో శునకాలను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయి. అవి ఆడుకుంటున్నప్పుడు యజమానికి బోర్‌ కొట్టకుండా అక్కడే కాఫీ షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే యజమానులు తమ శునకాలను ఈ పార్కుకు తీసుకువచ్చేందుకు 49 డాలర్లతో మొదటి నెల సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది.

Related posts