telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తాజ్‌మహల్ లో కాషాయ జెండాలు… జై శ్రీరాం నినాదాలు

tajmahal agra

కాషాయ జెండాలను చేతులో పట్టుకుని ఎగరవేస్తూ.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్దకు రావడం కలకలం సృష్టించింది… ఇక, ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. జేబులో కాషాయ జెండాలు పట్టుకుని తాజ్ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించిన నలుగురు యువకులు.. ఒకదగ్గర కూర్చిని.. తమ జేబుల్లోని జెండాలను బయటకు తీశారు.. అంతేకాదు.. హరహర మహాదేవ్, జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.. దీంతో ఆ యువకులను సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆ నలుగురు రైట్‌ వింగ్ ఆర్గనైజేషన్‌కు చెందినవారు.. అందులో జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారని చెబుతున్నారు. అరెస్టైనవారిని గౌరవ్ ఠాకూర్, సోను బాగెల్, విశేష్ కుమార్, రిషి లావానియాగా గుర్తించారు. ఇక, వీడియోలో ముగ్గురు వ్యక్తులు కాషాయ జెండాలను ఊపుతూ నినాదాలు చేయగా.. నాల్గో వ్యక్తి ఆ దృశ్యాలను కెమెరాలో బందించాడు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై  తాజ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌ సీఐ ఉమేష్ చంద్ర త్రిపాఠి మాట్లాడుతూ.. వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. యూపీలోని కొన్ని పట్టణాల పేర్లను మారుస్తూ వచ్చారు. ఇదే సమయంలో.. ఆగ్రా పేరును కూడా మార్చాలనే చర్చ కూడా సాగిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts