telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రష్యా ప్రధాన మంత్రి .. దిమిత్రి మెద్వెదేవ్‌ … రాజీనామా…

russia pm resignation

టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వెదేవ్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించింది. దిమిత్రితో సహా రష్యా ప్రభుత్వ మంత్రిమండలి మొత్తం పదవుల నుంచి వైదొలగినట్లు పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన క్రమంలో దిమిత్రి రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. పుతిన్‌ మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు ప్రధాని, మంత్రుల అధికారాలను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో ప్రధాని దిమిత్రి తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు దిమిత్రి మాట్లాడుతూ… దేశ భవిష్యత్తుకై అధ్యక్షుడు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇకపై తదుపరి నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు అని పేర్కొన్నారు.

Related posts