నరేంద్ర మోడీ 69వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్ రాష్ట్రంలో పూర్తి జలకళతో ఉట్టిపడుతున్న సర్దార్ సరోవర్ డ్యామ్‌ను సందర్శించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ డ్యామ్‌లో ఇపుడు పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వవుంది. ఇదిలావుంటే, మోడీ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మోడీ సామాజిక సందేశాలను వ్యాప్తి చేసేందుకు గుజరాత్‌లోని మోడీ జన్మస్థలమైన వాడ్నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఢిల్లీలోని అశోక్ రోడ్‌లోని తన నివాసం దగ్గర రాజ్యలక్ష్మి సహా ఇతర బైకర్ల ర్యాలీని బీజేపీ ఎంపీ విజయ్ గోయెల్ జెండా ఊపి ఆవిష్కరించారు
ఏస్ బైకర్ రాజ్యలక్ష్మి నేతృత్వంలో సెప్టెంబరు 20వ తేదీన నాలుగు రాష్ట్రాల మీదుగా 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బైక్ ర్యాలీ వాడ్నగర్ చేరుకోనుంది. మోడీ సామాజిక సందేశాల్లో ప్రధానమైన స్వచ్ఛ్ భారత్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వంటి సందేశాలను వ్యాప్తి చేసి యువకుల్లో స్ఫూర్తిని ప్రేరేపించడంలో రాజ్యలక్ష్మి ప్రధాన కర్తవ్యమని గోయెల్ అన్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 20 వరకు బిజెపి ‘సేవా సప్తా’ (సేవా వారం) పాటించనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలంతా పాల్గొననున్నారు.