telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పునర్నవి సంచలన పోస్ట్… బిగ్ బాస్ హౌజ్ లో బాడీ డ్యామేజ్…!?

punarnavi targeted this week in bigg boss 3

బిగ్ బాస్-3 తెలుగు విజయవంతంగా కొనసాగుతోంది. ఇక వ‌చ్చే వారం ఎలిమినేష‌న్‌కు మొత్తం హౌస్ నుంచి న‌లుగురు నామినేట్ అయ్యారు. వారిలో స్టార్ కపుల్ వరుణ్.. వితిక శేరు, రాహుల్ మరియు మహేష్ విట్టా ఉన్నారు. అయితే గోల్డెన్ మెడాలియ‌న్ టాస్క్‌లో విజేత‌గా నిలిచిన వితిక త‌న మెడాలియ‌న్‌ను త్యాగం చేయ‌డంతో ఒక ఎలిమినేషన్ నుండి తప్పించుకొనే అవకాశం ఉండటంతో ఆమె ఆ అవకాశం ఉపయోగించుకొని, ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు. ఇక మిగిలిన ముగ్గురు సభ్యులైన వరుణ్, మహేష్, రాహుల్ లలో ఒకరు వచ్చే వారం షో నుండి బయటకు వెళ్లిపోనున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో ఈవారం పునర్నవి భూపాలం ఎలిమినేట్ అయిపోయింది. అయితే, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఓ ఫేస్ బుక్ పోస్ట్ చేసింది. అందులో ఆమె వాడిన పదాలు.. అభిమానులను ఆందోళనలో పడేశాయి. “మనసు, శరీరానికి జరిగిన డ్యామేజీ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నా. ఏదేమైనా, అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా ముందు ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది” అంటూ తన ఫేస్ బుక్ పేజ్‌లో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవి భూపాలం సుమారు 76 రోజుల పాటు గడిపింది. 77వ రోజు హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ హౌస్ ద్వారా టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

Related posts