ఉప్పెన హీరోయినా కృతి షెట్టి చరిత్రలో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మంచి హీరోయిన్‌గా పేరుతో పాటు అవకాశాలు అందుకుంటుంది. అయితే ప్రస్తుతం అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 19న విడుదలకు సిద్దంగా ఉంది. భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు. గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా గుర్రాల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. అఖిల్ ఇటీవల తరచుగా హార్స్ రైడింగ్ వీడియోలు షేర్ చేస్తుండటంతో ఈ సినిమా కోసమే అఖిల్ ఈ ఫీట్లు చేస్తున్నాడా అని అక్కినేని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. కాగా, ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పేరు వినిపిస్తోంది. ఉప్పెన సినిమా విడుదలకు ముందే ఈ బ్యూటీ స్టార్ హోదాను పొందుతుంది. మెగాస్టార్ కూడా రాబోయే రోజుల్లో కృతి బిజీ హీరోయిన్ గా మారడం ఖాయం అనడంతో.. దర్శకనిర్మాతలు ఈ బ్యూటీపై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్ అయిన కృతి, ఇప్పుడు అఖిల్ సినిమాలోనూ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో మూడు సినిమాల ఆఫర్లు అందుకుంది కృతి . ఈ మూడు సినిమాలు ఇంకా చర్చల దశలో ఉన్నాయి. అయితే కృతి నటించిన ఉప్పెన సినిమా ఈ నెల 12 న విడుదల అవుతుంది.
previous post