ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కవి వరవరరావుతో పాటు ఇతరులను వెంటనే జైలు నుండి విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్ సిబ్బంది వెనక్కి వెళ్లాల్సిందిగా పేర్కొంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు లేఖను విడుదల చేశారు.
భీమా కోరెగావ్ సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, ఇతరులను విడుదల చేయాలని కోరింది. వరవరరావుపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరింది. ఉపా, ఎన్‌ఐఏ కేసులు ఎత్తివేయడంతో పాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని లేఖలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కోరింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం: రవితేజ