telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీ, రానాకోసం అతన్ని తొక్కేస్తున్నారని చెప్పాడు… నెపోటిజంపై వర్మ కామెంట్స్

Ramgopal varma

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనే అంశంపై పలు చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయంపై ఆసక్తికరంగా స్పందించారు వర్మ. హిందీలో ఫిరోజ్ ఖాన్, అమితాబ్ లాంటి హీరోలు తమ కుమారులను స్టార్ హీరోలుగా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. గతంలో జరిగిన ఓ విషయాన్ని వర్మ ప్రస్తావించారు. కొన్నేళ్ల క్రితం తనను ఓ తమిళ నటుడు కలిశాడని… అల్లు అర్జున్, రానా కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ, రానాను ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు నన్ను తొక్కేస్తున్నారని, తెలుగులో మా లాంటి వాళ్లకు థియేటర్లు ఇవ్వడం లేదని ఆ హీరో చెప్పినట్లు వర్మ పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు చేయడం పనికిరాని వాళ్ళ పని అంటూ వర్మ చెప్పడం హాట్ ఇష్యూ అయింది. థియేటర్లో ఎవరి మూవీ చూడాలనేది పూర్తిగా ప్రేక్షకుడి ఛాయిస్ మాత్రమే. ప్రేక్షకుడి ఆధరణే ఉంటేనే ఆ సినిమా ఆడటం, హీరోకి స్టార్ స్టేటస్ తీసుకురావడం జరుగుతుంది. అంతేగానీ ఓ స్టార్ హీరోనో, నిర్మాతనో తలచుకొంటే తమ కొడుకులను స్టార్ హీరోలు చేయడమనేది జరిగే పని కాదని వర్మ అన్నారు.

Related posts