డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి, ప్రముఖుల నుంచి పూరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఛార్మి ట్విటర్ ద్వారా పూరీకి విషెస్ తెలియజేసింది. “నా సంరక్షకుడు, ప్రాణ స్నేహితుడు, ఎప్పుడూ నా క్షేమం గురించి ఆలోచించే వ్యక్తి, ఉత్తమ వ్యాపార భాగస్వామి అయిన పూరీ జగన్నాథ్‌గారికి నా హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు గర్వపడేలా చేస్తానని మాట ఇస్తున్నా” అంటూ ఛార్మి ట్వీట్ చేసింది. ఇక డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి అనుబంధం గురించి తెలిసిందే. వీరిద్దరూ సంయుక్తంగా ఓ నిర్మాణ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నారు.
To a man with million hearts ♥️
My guardian,my best friend,most caring person n best business partner 🥰
My heart full wish is to c u happy n healthy always 🥰
Happiest birthday my director @purijagan
N I promise to keep making u proud always
Let’s rock more#HBDPuriJagannadh pic.twitter.com/VpZngYVSX1— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2020