telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దెబ్బకు దిగివచ్చిన కేంద్రం… చట్టంలో ఐదు సవరణలకు సై !

రైతుల డిమాండ్‌తో వ్యవసాయ చట్టంలో ప్రభుత్వం ఐదు సవరణలకు సిద్ధమైంది. చట్టాల్లో సవరణ ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది కేంద్రం. ఈ చట్టాలపై  రైతు సంఘాల నేతలతో కేంద్రం సమాలోచనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న “కనీస మద్దతు ధర” ( MSP) విధానం కొనసాగుతుందని…. లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసింది. “మండి వ్యవస్థ” ( ఏ.పి.ఎమ్.సి) ను రైతుల సూచనల మేరకు మార్పులు చేసేందుకు సంసిద్ధత ఉన్నట్టు… ప్రభుత్వ – ప్రైవేటు మార్కెట్లలో ఒకే పన్ను విధానం ఉంటుందన్న సవరణకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ ప్రతిపాదన చేయగా… వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటే, ప్రయువేట్ కంపెనీ పేరును నమోదు చేసుకోవడం తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కొత్త చట్టంలో “పాన్” కార్డు ఉన్న వారెవరైనా కొనుగోలు చేసే వెసులుబాటు ఉండనుండగా. కానీ, ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన విధించేందుకు ప్రభుత్వం సంసిధ్దంగా ఉంది. ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పులు చేస్తామన్న కేంద్రం… వ్యాపారులు-రైతుల “కాంట్రాక్ట్ వ్యవసాయం” ఒప్పందాలలో వచ్చే వివాదాల పరిష్కారంలో సబ్ కలెక్టర్ కు సంక్రమించిన అధికారాల సవరణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఒప్పంద వ్యవసాయంలో రైతులు సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా సవరణ చేయనుండగా…. ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించేలా మరో సవరణ చేసింది. పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు అంగీకరించింది కేంద్రం.

Related posts