జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా దాడి సహా పలు ఉగ్రదాడులకు వ్యూహం పన్నిన నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తాజాగా కోర్టులో చార్జిషీట్ సమర్పించింది. జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన సజ్జాద్ ఖాన్, తన్వీర్ అహ్మద్ గానీ, బిలాల్ అహ్మద్ మీర్, ముజఫర్ అహ్మద్ భాత్ లపై ఎన్ఐఏ కోర్టులో చార్జిషీటు వేసింది. సజ్జాద్ ఖాన్ పుల్వామా దాడి ఘటనకు వ్యూహం రూపొందించాడని తేలింది.
జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు పథకం పన్నారని దర్యాప్తులో వెలుగుచూసింది. పుల్వామా పట్టణానికి చెందిన నలుగురు ఉగ్రవాదుల వెనుక ఇటీవల ఎన్‌కౌంటరులో మరణించిన కరడుకట్టిన ఉగ్రవాది ముదసిర్ ఖాన్ ఉన్నాడని తేల్చారు. మొత్తంమీద ఈ నలుగురిపై కేసు కోర్టులో దాఖలు కావడంతో దర్యాప్తు సాగనుంది.
త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా వరుస ఆత్మహత్యలు… సింగర్ సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు