telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పీఠం బీజేపీ కే..కూటమి తో పనిలేని..భారీ మెజారిటీ..

మొత్తం 542 స్థానాలకు నేడు లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం అయిన ఈ లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఈవీఎం, ఆ తరువాత వీవీ ప్యాట్ లు లెక్కించారు. గెలుపు కోసం ఏ కూటమి అయినా 272 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంది. మళ్ళీ బీజేపీ తిరుగులేని ప్రభావాన్ని చూపింది. ఆధిక్యం మ్యాజిక్ నెంబర్ దాటేసి, ఒక దశలో కూటమి అవసరం లేని మెజారిటీ సాధించింది.

మొదటి బోణిగా, బీజేపీ కర్ణాటకలోని చిక్కొడిలో ఆధిక్యంతో గెలుపు ఖాతా తెరిచింది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఏపీలో వైసీపీ ప్రభంజనం(151 ఆస్సాంబ్లీ, 22 ఎంపీ) కొనసాగితే; తెలంగాణాలో బీజేపీ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. తెరాస 8, కాంగ్రెస్ 3 స్థానాలు దక్కించుకున్నాయి.

ముఖ్యంగా బరిలో ఉన్న కూటములు : ఆధిక్యం / గెలుపు/ మొత్తం.
ఎన్డీయే : 00/ 349/349
యూపీఏ : 00/ 86/86
ఇతరులు : 00/107 / 107

Related posts