telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“తిప్పరా మీసం” ట్విట్టర్ రివ్యూ… బొమ్మ హిట్టే…!

Srivishnu Tippara Mesam

యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం “తిప్పరా మీసం”. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ యాక్షన్ డ్రామాను ఎల్.కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ‘తిప్పరా మీసం’ సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌, ట్రైర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సీనియర్ నటి రోహిణి హీరో తల్లి పాత్ర పోషించారు. టైటిల్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అక్కడ సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో తల్లీకొడుకుల సెంటిమెంట్ అద్భుతంగా పండిందట. తల్లీకొడుకులుగా రోహిణి, శ్రీవిష్ణు అద్భుతంగా చేశారని, ఆ పాత్రల్లో జీవించారని కొనియాడుతున్నారు. సినిమా ఆఖరి 30 నిమిషాలు అయితే చెప్పడానికి మాటలు సరిపోవు అంటున్నారు. అలాగే, ఇంటర్వెల్ సీన్ అయితే బాక్సు బద్దలైపోవడం ఖాయమని ఒక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు. దీనికితోడు సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచిందని టాక్. అయితే సినిమా బాగుంది కానీ.. ఫస్టాఫ్‌లో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగిందంటున్నారు. అలాగే కథనం కూడా చాలా నెమ్మదిగా వెళ్తుందట. అయితే, ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్ బాగుంటే సినిమా హిట్టే.

Related posts