తెలంగాణ ఇంటర్ బోర్డు ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో తప్పులు దొర్లడంతో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఇంటర్ మార్కులు తప్పుల తడకలుగా రావడంతో 20 మంది వరకు బలవన్మరణం చెందారు. తాజాగా ఇంటర్ పేపర్ల రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల చేయగా, అత్యంత విచారకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆరుట్ల అనామిక అనే అమ్మాయికి ఏప్రిల్ లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తెలుగులో 20 మార్కులే వచ్చాయి.
ఇప్పుడు అదే పేపర్ ను రీవెరిఫికేషన్ చేయగా 48 మార్కులతో పాస్ అని వచ్చింది. కానీ, తన మార్కులు చూసుకోవడానికి అనామిక ఈ లోకంలేదు. ఏప్రిల్ లో ఫలితాలు వచ్చినప్పుడే తాను ఫెయిలయ్యానంటూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడామె పాస్ అని ఇంటర్ బోర్డు పేర్కొంటుండడం అందరి హృదయాలను కలచివేసింది.
లోకేష్ ఓ పప్పు.. అ ఆలు రావు: వైఎస్ షర్మిల