telugu navyamedia
క్రీడలు వార్తలు

పృథ్వీ షా పై పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు…

ఏప్రిల్ 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రారంభం కానుంది. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్​తో తలపడనుంది. ఐపీఎల్ 2021 కోసం భారత్ చేరుకొని క్వారంటైన్ పూర్తిచేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్.. ప్రస్తుతం ఆ జట్టు ఆటగాళ్ల సాధనను పర్యవేక్షిస్తున్నాడు. తాజాగా పాంటింగ్ మాట్లాడుతూ… ‘గతేడాది పృథ్వీ షా.. తన బ్యాటింగ్‌పై విచిత్రమైన వైఖరితో ఉన్నాడు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు నెట్స్‌లో బ్యాటింగ్‌ చేయడు. పరుగులు చేస్తుంటే నిరంతరం బ్యాటింగ్‌ చేస్తూనే ఉండాలనుకుంటాడు. నాలుగైదు మ్యాచుల్లో పదిలోపే ఔటయ్యాడు. మనం నెట్స్‌లో సాధన చేస్తూ ఎక్కడ తప్పు జరుగుతుందో చూద్దామని చెప్పాను. తనకు ఆసక్తిలేదని తేలిగ్గా చెప్పేశాడు’ అని తెలిపాడు. అయితే ‘పృథ్వీ షా ఇప్పుడు తన వైఖరి మార్చుకొని ఉండొచ్చు. కొన్ని నెలలుగా బాగా కష్టపడ్డాడు. అత్యుత్తమంగా ఆడితే సూపర్‌ స్టార్‌ అవుతాడు. షా పట్ల నేను కాస్త కఠినంగానే ఉన్నా. నువ్వు నెట్స్‌కి వెళ్లి సాధన చేయాలని గట్టిగా చెప్పాను. సాధన చేయాలని చెప్పినా అతడు విన్లేదు. ఫలితంగా పరుగులు చేయలేదు. అతడు వైఖరి మార్చుకుంటే భారత్‌కు సుదీర్ఘంగా ఆడగలడు’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.

Related posts