telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్యామ్ కె.నాయుడు అరెస్ట్… మోసం చేశాడంటూ “అర్జున్ రెడ్డి” నటి కేసు

Shyam K

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చోట కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. చోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్ కె.నాయుడు కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా అనేక సినిమాలకు పని చేశారు. కాగా, ఇప్పుడు ఆయనపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని చెప్పి సినీ ఆర్టిస్ట్ సాయి సుధా కేసు ఫైల్ చేసింది. సాయి సుధా అర్జున్ రెడ్డి సినిమాలో కూడా నటించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు.

Related posts