telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర స‌ర్కార్‌ను ఫెడ‌ర‌ల్ ఫ్రంటే ఏర్పాటు చేస్తుంది: మ‌మ‌తా

BJP compliant EC West Bengal

దేశంలో లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్ర స‌ర్కార్‌ను ఫెడ‌ర‌ల్ ఫ్రంటే ఏర్పాటు చేస్తుంద‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. కేంద్రంలో నాన్ ఎన్డీఏ, నాన్ యూపీఏ ప్ర‌భుత్వం ఏర్పాటు అవుతుంద‌న్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో ఉన్న నేత‌లే.. ప్ర‌ధాని అభ్య‌ర్థిని ఎన్నుకుంటార‌ని ఆమె చెప్పారు. సీఎన్ఎన్ఐబీఎన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ నేత‌లు త‌న‌తో టచ్‌లో ఉన్నార‌ని ఆమె తెలిపారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల‌న్న ప్రతిపాదనకు అంద‌రూ అంగీక‌రిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌నుకుంటున్న నేత‌లతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని ఆమె అన్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్ప‌డితే అంద‌రి అంగీకారంతోనే ప్ర‌ధాని అభ్య‌ర్థిని ఎన్నుకుంటామ‌న్నారు. బెంగాల్‌లో బీజేపీ త‌న రెండు సీట్ల‌ను కూడా కోల్పోతుంద‌న్నారు. మోదీ పాల‌న‌లో రైతుల‌ను విస్మ‌రించాన్నారు. గ‌త అయిదేళ్ల‌లో నిరుద్యోగం విప‌రీతంగా పెరిగింద‌న్నారు. నోట్ల ర‌ద్దు చ‌ర్య కూడా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసింద‌న్నారు.

Related posts