telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

దూసుకొస్తున్న ఫణి ..ముందుకొచ్చిన సముద్రం

rain effect

రానున్న 24 గంటల్లో ఫణి తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిజాంపట్నం ఎయిర్‌పోర్ట్‌లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. జిల్లాలో అనేక చోట్ల అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కోవూరు వంటి ప్రదేశాల్లో సముద్రం బాగా ముందుకు రావడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నెల్లూరు జిల్లా తమిళనాడుకు దగ్గరగా ఉండడంతో ఫణి తుపాను ప్రభావం ఈ జిల్లాపై గణనీయంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫణి నెల్లూరు జిల్లాకు సమీపంలోనే దిశ మార్చుకోనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు ముంద జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు.
t

Related posts