telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

బహిరంగ ఛార్జింగ్ ప్రదేశాలతో .. తస్మాత్ జాగర్త ..కేబుల్ ద్వారా మాల్ వైరస్ .. : ఎస్‌బీఐ

sbi logo

స్మార్ట్‌ఫోన్స్‌కు చార్జింగ్ పెట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ అంటుంది. మోసగాళ్లు మాల్వేర్‌బైట్స్‌ ద్వారా పసిగట్టే అవకాశాలు చాలా ఉన్నాయని హెచ్చరిస్తుంది. ఇక ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టేటప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలి అని తెలిపింది. మోసగాళ్లు లేదా హ్యాకర్లు మాల్వేర్ సాయంతో మీ ఫోన్‌లోని డేటా హ్యాక్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అని తెలిపింది. ఇలా చేయడంతో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా హ్యాకర్ల చేతిలోకి పోతున్నాయి అని హెచ్చరించింది ఎస్‌బీఐ. ఇక సైబర్ క్రైమ్ అధికారులు తెలిపిన ప్రకారం.. మాల్వేర్, ఫిషింగ్, అల్గరిథమ్ వంటి వాటి సాయంతో స్మార్ట్‌ఫోన్‌ నుంచి వివరాలు కొట్టేసే అవకాశాలు చాల ఉన్నాయి అని తెలిపింది. ఈ పని ఆటో డేటా ట్రాన్స్‌ఫర్ డివైజ్ ద్వారా హ్యాకర్ల పూర్తి చేసే అవకాశాలు చాల ఉన్నాయి అని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆటో డేటా ట్రాన్స్‌ఫర్ డివైజ్ 300 నుంచి 400 డాలర్లకు అలీబాబా వెబ్‌సైట్‌లో అందుబాటులో కూడా ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు.

మొబైల్ చార్జింగ్ స్టేషన్స్ ద్వారా ఆన్‌లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయో ఎస్‌బీఐ సోషల్ మీడియా ద్వారా తెలియచేయడం జరిగింది. ఇలా హ్యాకర్లు, ఆన్‌లైన్ మోసాలకు చేసేవారు ప్లగ్ ఇన్ కార్డుని వాడుతారు. వీటిని ఆటో డేటా ట్రాన్స్‌ఫర్ డివైజ్ అని కూడా అంటారు. చార్జింగ్ స్టేషన్‌లో వీటి ద్వారా ఫోన్‌కు చార్జింగ్ పెట్టినప్పుడు ఒక పాపప్ మెసేజ్ హ్యాకర్లు రావడం జరుగుతుంది. చాలా మంది దీన్ని గమనించారు. ఇపుడే అసలు తంటా మొదలు అయేంది ఇక్కడి నుంచే డేటా తస్కరణ మొదలు అవుతుంది’ అని న్యూఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు పూర్తి వివరాలతో తెలియచేయడం జరిగింది. ఇంకా మల్టీ కేబుల్ ద్వారా చార్జింగ్ పెట్టుకోవద్దని అని తెలిపారు. అలాగే సొంత చార్జర్‌తోనే ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకుంటే చాల మంచిది అని తెలిపారు. లేదంటే ఒక పవర బ్యాంక్ వాడుకోవడం జాగ్రత్త అని సైబర్ క్రైమ్ నిపుణులు తెలుపుతున్నారు.

Related posts