telugu navyamedia
రాజకీయ

వారసత్వ రాజకీయాలు దేశానికి ఎంతో ప్రమాదక‌రం – మోదీ

వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని దేశ ప్ర‌ధాని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్​.. ‘నేషనల్​ కాంగ్రెస్’​ అని పేరు ఎందుకు పెట్టుకుందని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తేవి కావని, సిక్కుల ఊచకోత లాంటి సంఘటనలు జరిగేవి కావని మోడీ ధ్వజమెత్తారు. అంజయ్య లాంటి సొంత పార్టీ నేతలనే అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకుందని మోడీ ధ్వజమెత్తారు

కరోనాతో దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొందని తెలిపారు. కరోనాతో ఎన్నో జీవితాలు అతలాకుతలం అయ్యాయని పేర్కొన్నారు. దేశమంతా ఏకతాటిపైకి వచ్చి కరోనాపై పోరాడటాన్ని మోదీ ప్రశంసించారు.

100 శాతం వ్యాక్సినేషన్​ దిశగా పయనిస్తోందని చెప్పారు. భారత కోవిడ్ నిర్వహణను ప్రపంచం మెచ్చుకుంటోందని ప్రధాని తెలిపారు. భారత్ లో తయారైన వ్యాక్సిన్లు ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు. వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యానికి అనుగుణంగా భారత్ అడుగులు వేస్తోందన్నారు.

రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి పథంలో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అందరూ దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భారత్​కు స్వాతంత్య్రం వచ్చి అప్పటికి 100 ఏళ్లు పూర్తి కానుందని.. అభివృద్ధి అజెండాగా ముందుకు సాగాలన్నారు.

Related posts