telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజగోపాల్ రెడ్డి .. యూ టర్న్ .. కాంగ్రెస్ లోనే..

rajagopal reddy

తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది, కేవలం బీజేపీ మాత్రమే అధికార పార్టీకి ప్రత్యామ్నాయం . దేశంలో మరో ఇరవై ఏళ్లు బీజేపీదే హవా. కాంగ్రెస్ మరో ఇరవై ఏళ్లైనా కూడా.. కోలుకునే పరిస్థితి లేదు.. అంటూ తీవ్రంగా విమర్శించారు మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే.. ఇక త్వరలో కమలం గూటికి చేరుతానంటూ ప్రకటనలు కూడా చేశారు. ఇంతలో ఏమి అయ్యిందో ఏమో గానీ.. యూ టర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కోవడం కేవలం బీజేపీతోనే సాధ్యమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. అయితే సోమవారం మాటమార్చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్‌ను నియంత అంటున్నామని అన్నారు.

కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణ విముక్తి కావాలని.. అప్పుడు తెలంగాణ మూడో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుందని వ్యాఖ్యానించారు. టీపీసీసీ చీఫ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన రాజగోపాల్.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అదే పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఉత్తమ్, కుంతియాలను బహిరంగంగానే విమర్శించిన ఆయన.. టీపీసీసీ తన అన్నకి ఇవ్వాలంటూ కోరిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకవేళ టీపీసీసీ పదవిపై కోమటిరెడ్డి వెంటకరెడ్డి కన్నేశారా.. అందుకోసమే తమ్ముడితో ఇలా వ్యాఖ్యలు చేయించి ఉంటారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అన్న కోసమే తమ్ముడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. గతంలో రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై యూ టర్న్‌ తీసుకున్నారని అర్థమవుతోంది.

Related posts