telugu navyamedia
రాజకీయ

రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావుడిగా విభజించారు..

* తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు..

* ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చుపెట్టింది కాంగ్రెసే..
* రాజకీయ స్వార్ధం కోసమే కాంగ్రెస్‌ ఏపీని హడావుడిగా విభజించారు..
* తెలంగాణ ఇచ్చినా.. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు..
* ఏపీ, తెలంగాణ మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణం..
* మైక్‌లు కట్‌చేసి పెప్పర్‌ స్ప్రే కొట్టారు…

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఎత్తు చూపుతూ ప్ర‌దాని మోదీ మండిప‌డ్డారు. అధికారం అనే మత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా, తెలంగాణ మధ్య చిచ్చులు పెట్టిందని ప్రధాని ఆరోపించారు.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విభజన తీరును తప్పుబట్టారు.

ఏపీ విభ‌జ‌న ప్రక్రియ తప్పుల తడక అని , రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావిడిగా విభజించారని మోడీ గుర్తుచేశారు. పార్లమెంటులో కరెంటు తీసేసారని, పెప్పర్ స్ప్రే ప్రయోగించారని, మైకులు కట్ చేశారని విభజన నాటి పరిస్ధితుల్ని మోడీ గుర్తుచేశారు.

ఎలాంటి చర్చ జరగకుండానే విభజన బిల్లును కాంగ్రెస్ ఆమోదం తెలిపారని, దాని పర్యవసానాల వల్ల ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు ఇబ్బందలు పడుతున్నాయని మోదీ అన్నారు. కలిసి చర్చిస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరిగేది అని అన్నారు.

అటల్‌జీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. అప్పుడు ఎలాంటి గందరగోళం లేదు. శాంతిపూర్వకంగా.. నిర్ణయం జరిగింది. అంతా కూర్చుని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజన కూడా అలాగే చేయగలిగేవారం. 

తెలంగాణను తామే ఏర్పాటు చేశామని కాంగ్రెస్ క్రెడిట్ తీసుకున్నా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను న‌మ్మలేద‌ని, ఎన్నికల్లో ఓడగొట్టారని అన్నారు.

అయితే తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదన్న మోదీ.. విభజన జరిగిన తీరు సరిగ్గా లేదన్నారు. ఏపీ తెలంగా వైషమ్యాలకు కారణం కాంగ్రెస్సేనని మోడీ ఆరోపించారు. ఏపీ తెలంగాణలు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయని మండిప‌డ్డారు.

అవతలివాళ్లకు అపఖ్యాతి ఆపాదించడం, దేశంలో అస్థిరత నెలకొల్పడం, మంచిని తొలగిండం అనే మూడు విధానాలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహాలని మోదీ మండిపడ్డారు.

Related posts