telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. మొదటి మెగా ఫుడ్ పార్క్ ..

first mega food park launch in telangana

కేంద్ర ఫుడ్‌ ప్రాససింగ్‌ ఇండస్ర్టీస్‌ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ రాష్ట్రంలో మొట్టమొదటి మెగాఫుడ్‌ పార్క్‌ను ప్రారంభించారు. నిజామాబాద్‌జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ మాట్లాడుతూ వ్యవసాయోత్పత్తుల్లో దేశంలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న రాష్ర్టాల్లో తెలంగాణ కూడ ఉందని ఆమె అన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మెగా ఫడ్‌పార్క్‌ ఏర్పాటు వల్ల 22 ఫుడ్‌ ప్రాసెసింగ్‌యూనిట్‌లకు అదనంగా మరో 250 కోట్లరూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం వుందని అన్నారు. తద్వారా 14వేల కోట్ల టర్నోవర్‌ సాధించే అవకాశం ఉందన్నారు. ఈపార్క్‌ఏర్పాటు వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపు 50వేల మంది యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా మరో లక్ష మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టంపు అయ్యేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

మెగా ఫుడ్‌పార్క్‌ వల్ల మహిళలుకూడా ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌యూనిట్‌లు ఏర్పాటు వల్ల వ్యవసాయ రంగం మరింత అభివృద్ధిసాధించే అవకాశం ఉందన్నారు. తద్వారా రైతులు లాభపడతారని అన్నారు .మేకిన్‌ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉత్పాదక రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మెగాఫుడ్‌పార్క్‌వల్ల కేవలం నిజాబాబాద్‌జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాలైన నిర్మల్‌, జగిత్యాల్‌, రాజన్న సిరిసిల్లజిల్లా, కామారెడ్డితో పాటు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ప్రజలకూ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 78 ఎకరాల్లో 108.95 కోట్లతో దీనిని ప్రారంభించినట్టు నిర్వాహకులుతెలిపారు.

Related posts