క్రికెట్ నేపథ్యంలో సాగే నటుడు నాని చిత్రం ‘జెర్సీ’ కుటుంబకథా చిత్రం గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అల్లు అరవింద్, దిల్‌రాజు ఈ రీమేక్‌కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. షాహిద్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మొహలీ స్టేడియంలో జరుగుతోంది.
తాజాగా షూటింగ్‌లో భాగంగా షాహిద్‌పై క్రికెట్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలి. అయితే షూటింగ్‌కు ముందు ఓ సన్నివేశాన్ని రిహార్సల్స్ చేస్తుండగా షాహిద్ పెదవికి బాల్ తగిలి పెద్ద గాయమైంది. దీంతో చిత్రబృందం షాహిద్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించింది. వైద్యులు పరిశీలించి కింద పెదవికి గాయం కావడంతో 13 కుట్లు వేశారు. ఈ విషయం తెలుసుకున్న షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.