telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

కరోనా బీభత్సం…. తెలంగాణలో మళ్లీ థియేటర్లు బంద్‌ ?

Theatre

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు… గత 10 రోజుల నుంచి విజృంభిస్తున్నాయి.  ముఖ్యంగా ఈ కరోనా ఎఫెక్ట్‌ విద్యార్థులపైన పడింది. దీంతో నిన్న అసెంబ్లీలో విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించేసింది. విద్యాసంస్థలు నేటి నుంచి మూతపడనున్నాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి థియేటర్లపై పడింది. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లు ఎందుకు మూసివేయడం లేదనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో థియేటర్లు మళ్లీ మూసివేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది. ఆలస్యం చేస్తే మరింత ముప్పు ఖాయమంటూ హెచ్చరిక చేసింది. థియేటర్లు పూర్తి స్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే.. 50 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగించాలని సూచించింది. వరుసగా కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో 90 శాతంపైనే నిండిపోతున్నాయి. ప్రేక్షకులు మాస్క్‌, సామాజిక దూరం పాటించకపోవడంతో.. కరోనా తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే..దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.  కాగా… కరోనా కారణంగా ఇప్పటికే సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

Related posts