పవన్ కాలిన చేసిన గత సినిమాలో హీరోయిజం పీక్స్ లో ఉంటుంది. చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ప్రేక్షకులకు ఇవ్వాలని చూస్తున్నాడు.త్వరలో హరీష్ శంకర్ తో చేసే సినిమాలోను మనోడు అలాంటి యాక్షన్ ప్యాక్ నే ట్రై చేస్తున్నాడు. ఐతే ఈసారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో డాన్ గెటప్ తో ఫ్యాన్స్ ను మరింతగా సర్ఫరైజ్ చేయాలని చూస్తున్నాడు. పవర్ స్టార్ ఎన్ని యాక్షన్ ప్యాక్స్ చేసినా… తాను డాన్ పాత్ర పోషించింది లేదు. పవర్ ఫుల్ కాప్ గా మాత్రమే కనిపించాడు.అదీ లేదంటే సొసైటీ భాద్యతలు తీసుకున్న కుర్రాడిగా అలరించాడు. పంజా సినిమాలో డాన్ కు అణుచరుడిగా మాత్రమే నటించాడు తప్ప ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్ డాన్ గా అయ్యింది లేదు. నిజానికి ఇక్కడ ఫుల్ లెన్త్ డాన్ క్యారెక్టర్ అయితే అటు పవన్ కూడా ఒప్పుకునేవాడు కాదు. జస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకే ఈ డాన్ అని తెలియడంతో దానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.
అయితే ఈ డాన్ పాత్రను తెలుగులో ఇప్పటివరకు అంతగా టేకప్ చేసిన నేటితరం హీరోలు ఎవరు లేరు.ఒకవేల చేసినా అది అతిగా అనిపిస్తుందనే అనుమానం మన హీరోలను ఇంతకాలం భయపెట్టింది.కోలీవుడ్లో రజనీ,కమల్ ,అజిత్ లు ఇప్పటికే డాప్ వేషాలు వేసి అక్కడ ప్రేక్షకులను భాగానే ఎంటర్ టైన్ చేశారు.మరి తెలుగుకు వచ్చేసరికి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే లెక్కల్లోనే ఇంతకాలం మనవాళ్లు ఉన్నారు.కాకపోతే ఈసారి హరీష్ ఎంచుకున్న కథతో పవన్ ను ఎక్స్ ట్రీం లెవెల్లో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే డాన్ పాత్రతో పాటు కాస్త లవ్ థీమ్ ను సినిమాలో చూపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
మూఢ నమ్మకాలతో సచివాలయ భవనాలను కుల్చోద్దు: రేవంత్