లాక్ డౌన్ తర్వాత రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ వద్ద ప్రయాగ్ రాజ్ – లక్నో జాతీయ రహదారిపై అర్ధరాత్రి తరువాత రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్ ను జీబు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా వచ్చిన జీవు ఆగిఉన్న ట్రక్ ను ఢీకొట్టింది. దీంతో జీబు ముందుభాగం మొతం ధ్వంసం అయ్యింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం ఉంద అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై యూపీ యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
previous post