ఏపీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు నిన్న రాగా, ఇవాళ ఉదయం గుంటూరు-కృష్ణా జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి నారాయణ రావుపై ఆయన 1537 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. షేక్ సాబ్జీకి 7983 ఓట్లు పడగా.. నారాయణకు 6446 ఓట్లు పోలయ్యాయి. ఇక గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించారు. విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు (6153) దాటడడంతో కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 6153 రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 6153 సాధించడంతో కల్పలత విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం అనంతరం కల్లలత మీడియాతో మాట్లాడుతూ.. తన విజయానికి తోడ్పడ్డ వారికి ధన్యవాదాలు తెలిపారు.
next post