telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

స్థిరంగానే బంగారం… పడిపోయిన వెండి ధరలు

బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో స్థిరంగా ఉంటె ఢిల్లీలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం 10 తగ్గి రూ. 48,150 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 తగ్గి రూ. 44,140 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,830 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,010 పలుకుతోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి ధరలు కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.71,600 వద్ద కొనసాగుతోంది.

Related posts