telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోంది…

తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. కేసీఆర్ పాలన..మరో తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఫైర్‌ అయ్యారు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో  పాల్గొన్న ఉత్తమ్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఒక్కటే..ఈ దేశం కోసం..ఈ మట్టి కోసం పని చేస్తోందన్నారు. జై జవాన్.. జై కిసాన్ అన్నది కూడా ఒక కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కేసీఆర్ దరిద్రపు పాలన కొనసాగుతుందని.. రైతులను నట్టేట మోసం చేసిందని ఫైర్ అయ్యారు. Msp ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. లాభ నష్టాల గురించి ఆలోచిస్తుందని మండి పడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని.. పార్టీ నాయకులు నిరుత్సాహపడొద్దని కోరారు. నియంతృత్వ సాగుకు తాము వ్యతిరేకమని.. తాము వద్దన్నప్పుడు మమ్మల్ని కేసీఆర్‌ తిట్టాడని గుర్తు చేశారు. రైతుల కోసం 8 వేల కోట్లు భరించలేడా..? కాంట్రాక్టర్ల కు మాత్రం వేల కోట్లు ఇస్తాడని నిప్పులు చెరిగారు. అధిష్టానం తనను పీసీసీ విషయంలో ఇప్పటి వరకు అభిప్రాయం అడగలేదని… అడిగితే చెప్తానన్నారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన రావచ్చని… అందరికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

Related posts